ఆరోగ్య సిరి.. ఉసిరి. చలికాలం తీసుకుంటే.. 

Narender Vaitla

12 November 2024

గుండె జబ్బులను తగ్గించడంలో ఉసిరి కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఔషధ గుణాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి.

చలికాలం జీర్ణ సంబంధిత సమస్యలు రావడం సర్వసాధారణం. ఈ సమస్యలను చెక్‌ పెట్టడంలో ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. ఉసిరి తింటే మలబద్దకం దూరమవుతుంది. కడుపు ఆమ్లాన్ని సమతుల్యం చేయడంలో ఉసిరి ఉపయోగపడుతుంది.

చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా ఉసిరి బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్‌ సి రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. అలాగే ఐరన్‌ చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది.

ఉసిరిలో ఉండే మంచి గుణాలు శరీరంలో మంటను తగ్గించడానికి బాగా సహాయపడతాయి. అలాగే కీళ్ల నొప్పులు, మోకాళ్ల నొప్పులు వంటి ఆర్థరైటిస్ సమస్యలను తగ్గిస్తాయి. 

ఉసిరిలో యాంటీఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి శరీరంలో క్యాన్సర్‌ కణాలు పెరగకుండా చేయడంలో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా ఉసిరి ఎంతో ఉపయోగపడుతుందని నిపునులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ సి, ఫైబర్‌ కంటెంట్‌ షుగర్‌ పేషెంట్స్‌కి వరమని చెప్పాలి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.