వ్యాయామం చేయడం ఆరోగ్యానికి మంచిదని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అయితే కఠిన వ్యాయామాలు మేలు కంటే కీడు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
కఠిన వ్యాయామాలు చేస్తే రోగ నిరోధక వ్యవస్థను అణిచివేస్తుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఇందుకోసం పలువురు అగ్నిమాపక సిబ్బందిని పరిగణలోకి తీసుకున్నారు.
ఎమర్జెన్సీ వర్కర్లు, అథ్లెట్లు వంటి కఠిన వ్యాయామ శిక్షణ అవసరమైన వృత్తుల్లో ఉన్న వ్యక్తులకు ఈ అధ్యయన వివరాలు ఆందోళన కలిగిస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు.
అధిక ఫిట్‌నెస్ కోసం కఠిన వ్యాయామం చేసే వారు వైరల్ రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్స్ బారిన పడే ముప్పు పొంచి ఉందని పరిశోధకులు చెబుతున్నారు.
ఓ మోస్తరు వ్యాయామం చేస్తే రోగ నిరోధక వ్యవస్థపై ఎలాంటి ప్రభావం ఉండని ఆధారాలు ఉన్నాయని పరిశోధకులు చెబుతున్నారు.
అయితే మోతాదుకు మించి వ్యాయామం చేస్తే మాత్రం రోగనిరోధక వ్యవస్ధపై తక్షణమే ప్రతికూల ప్రభావం ఉంటుందని అభిప్రాయపడుతున్నారు.
అధ్యయనంలో భాగంగా ఫైర్ ఇంజన్ సిబ్బందిని కఠిన వ్యాయామం చేసే ముందు, అనంతరం వారి బ్లడ్ ప్లాస్మా, యూరిన్, సలీవాను పరిశీలించారు.
వ్యాయామం చేసిన తర్వాత వీరిలో రోగనిరోధక వ్యవస్థ తగ్గినట్లు పరిశోధకులు గుర్తించారు. అయితే వీరు కాలుష్య వాతావరణలో పనిచేయడం కారణంగా ఇలాంటి రిజల్ట్ రావొచ్చనే వాదనలు వినిపిస్తున్నాయి.