02 September 2023

ఆరోగ్యంగా తినండి-ఆరోగ్యంగా ఉండండి!

వంటగదిని దేవుడి గది అంత ఆధ్యాత్మికంగా, పవిత్రంగా చూసుకుంటూ ఉంటారు. ప్రపంచంలో ప్రతి ఒక్కరికీ వంట గది అనేది చాలా ప్రత్యేకమైనది. 

వంట పాత్రలు మొదలుకుని ఇతర ఉపకరణాలు, ఆహార పదార్థాల వరకు ఇలా కిచెన్ స్టేపుల్స్ జాబితా చాలా పెద్దదిగా ఉంటుంది. అయితే వంట గదిలో ఉండేవన్నీ ఆరోగ్యానికి మంచివేనా అని సరిచూసుకోవాలి.

కొన్ని సమయాల్లో మనకు తెలియకుండానే అనారోగ్యాన్ని కలిగించే వస్తువులు వంటగదిలోకి వచ్చి చేరుతుంటాయి. అలాంటి వస్తువులు ఏమైనా ఉన్నాయా అని ఒకటికి రెండు సార్లు చెక్‌ చేసుకుంటే మంచింది. 

అల్యూమినియంతో చేసిన వంట గిన్నెలు, పాన్‌లు దాదాపు ప్రతి వంటగదిలో ఉంటాయి. అల్యూమినియంను ఇతర పదార్థాలతో కలిపి వేడి చేస్తే ఆరోగ్యానికి విషపూరితం అవుతుందని చెబుతున్నారు నిపుణులు.

మిగతా వస్తువులతో పోల్చితే అల్యూమినయం దృఢమైనది, దీర్ఘకాలం మన్నికగా ఉంటుంది. అల్యూమినియం బదులుగా వంట కోసం స్టెయిన్‌లెస్ స్టీల్, కాస్ట్ ఐరన్ వంటి ఉపకరణాలు వాడితే మేలంటున్నారు. 

శుద్ధి చేసిన నూనె తేలికైనది, సువాసన ఉండదు. డీప్ ఫ్రైయింగ్ ఫుడ్‌కు ఎక్కువగా వాడుతుంటారు. కానీ, ఎన్నో అనారోగ్య సమస్యలకు దారి తీస్తుందంటున్నారు. 

రింఫైండ్‌ అయిల్‌ రసాయనాలతో ప్రాసెస్ చేసినప్పుడు, దానిలోని పోషకాలను తొలగిస్తుంది. ఆలివ్ ఆయిల్, నువ్వుల నూనె వంటి ఇతర ఆరోగ్యకరమైన నూనెలు వాడాలని నిపుణులు సలహా ఇస్తున్నారు. 

చాలా మంది తమ కిచెన్లలో వెంటనే తినడానికి పనికొస్తాయన్న పేరుతో ప్రిజర్వేటివ్స్‌తో నిలువ చేసిన ప్యాకేజ్డ్ ఫుడ్‌ను సిద్ధంగా ఉంచుకుంటారు. కానీ రోజూ అవి తినడం ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదంటున్నారు వైద్యులు.