ఆవు, గేదె పాలు ఇష్టం లేదా? ఈ పాల గురించి తెలుసుకోండి

March 14, 2024

TV9 Telugu

పాలు సంపూర్ణ పోషకాహారం అని వైద్యులు చెబుతుంటారు. అయితే కొన్ని రకాల ఆరోగ్య సమస్యలున్న వారు మాత్రం పాలకు దూరంగా ఉంటుంటారు. వీరికి పోషకాలు అందాలంటే ఇతర పాల ప్రత్యామ్నాయాల్ని ఎంచుకోవాలి

విభిన్న పాల ప్రత్యామ్నాయాల ద్వారా వారికి కావాల్సిన పోషకాలు అందడంతో పాటు ఇవి ఆరోగ్యానికీ మేలు చేస్తాయంటున్నారు నిపుణులు. గేదె, ఆవు పాలకు ప్రత్యామ్నాయంగా ఏయే పాలు తీసుకోవాలంటే..

కొంతమందికి పాల పదార్థాలు పడవు. మరికొందరిలో జీర్ణవ్యవస్థ పాలలోని చక్కెరల్ని జీర్ణం చేసుకోలేదు. ఈ రకమైన సమస్యను ‘లాక్టోజ్‌ ఇన్‌టాలరెన్స్‌’గా పిలుస్తారు

ఇలాంటి వారు మార్కెట్లో దొరికే విభిన్న పాల ప్రత్యామ్నాయాలు ఎంచుకోవచ్చు. సోయా పాలు.. వీటిని సోయా బీన్స్‌ నుంచి తయారు చేస్తారు. వీటిల్లో ఆవు పాలతో సమానమైన విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి

పచ్చి కొబ్బరి నుంచి తీసిన పాలు చిక్కగా, క్రీమీగా ఉంటాయి. వీటిల్లో మంచి కొవ్వులు, విటమిన్‌ ‘సి’ పుష్కలంగా ఉంటాయి. బరువు తగ్గాలనుకునే వారికి ఇది చక్కటి ఎంపిక

ముడి ఓట్స్‌ లేదా ఓట్‌మీల్‌ను నీటితో కలిపి ఓట్స్‌ పాలు తయారుచేస్తారు. క్రీమీగా ఉండే ఈ పాలు రుచికి కాస్త తియ్యగా ఉంటాయి. ఈ పాలలో పుష్కలంగా ఉండే ఫైబర్‌ జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది

మిల్లులో ఆడించిన బియ్యం, నీళ్లు కలిపి.. బియ్యం పాలను తయారుచేస్తారు. ఇవి ఆవు పాల కంటే పల్చగా, రుచికి తియ్యగా ఉంటాయి. మాంగనీస్‌, సెలీనియం వంటి యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి

బాదం, పల్లీలు, హేజల్‌నట్స్‌, జీడిపప్పు వంటి గింజ ధాన్యాలతో నట్‌ మిల్క్‌ తయారుచేసిన పాలు మార్కెట్లో దొరుకుతాయి. వీటిలో క్యాలరీలు తక్కువగా క్యాల్షియం, విటమిన్‌ ‘డి’, విటమిన్‌ ‘బి12’ వంటి పోషకాలు ఎక్కువగా ఉంటాయి