17 November 2023
చలికాలంలో శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలి. శరీర ఉష్ణోగ్రతను పెంచే పదార్ధాలను చేర్చుకోవాలి.
శీతాకాలంలో మీరు తినే ఆహార విషయంలో కొన్ని నియమాలు పాటించాలి. వార్మింగ్ ప్రభావాన్ని కలిగి ఉన్న వాటిని తినే ఆహారంలో చేర్చుకోవాలి.
వంటగదిలో ఉపయోగించే మసాలా దినుసుల గురించి తెలుసుకుందాం.. ఇవి శరీరానికి వెచ్చదనాన్ని అందించడమే కాదు ఆరోగ్యానికి కూడా మేలు చేస్తాయి.
దాల్చిన చెక్క మసాలా ఆహారం రుచిని పెంచడమే కాకుండా ఆరోగ్యానికి అనేక ప్రయోజనాలను అందిస్తుంది. ఇది రోగనిరోధక శక్తిని పెంచుతుంది
నల్ల మిరియాలు స్వభావం వేడిగా ఉంటుంది. ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు జలుబు, దగ్గు వంటి సమస్యలను దూరం చేయడంలో సహాయపడతాయి.
లవంగం వేడి స్వభావం కలిగి ఉంటుంది. అంతేకాకుండా లవంగాలలో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. దీంతో జలుబు, దగ్గు సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది.
పసుపులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. జలుబు, కీళ్ల నొప్పులు మొదలైన అనేక సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.
పసుపులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. జలుబు, కీళ్ల నొప్పులు మొదలైన అనేక సమస్యల నుండి ఉపశమనం పొందడంలో సహాయపడుతుంది.