కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? రోజూ ఉదయం ఈ జ్యూస్ తాగండి

 27 May 2024

TV9 Telugu

Pic credit - getty

మీరు కీళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? కూర్చోవడానికి, నడవడానికి ఇబ్బందిగా ఉందా? ఇవి పెరిగిన యూరిక్ యాసిడ్ సంకేతాలు కావచ్చు.

శరీరంలో యూరిక్ యాసిడ్ స్థాయిలు పెరగకుండా అదుపులో చేసుకోవలాలి. కొన్ని రకాల ఆహారాలపై యూరిక్ యాసిడ్ స్థాయిలపై ఆధారపడి ఉంటుంది.

క్యాబేజీ, క్యాలీఫ్లవర్, పప్పులు, పెరుగు, రొయ్యలు, చికిన్ మొదలైన ప్యూరిన్ అధికంగా ఉండే ఆహారాన్ని తినడం వల్ల యూరిక్ యాసిడ్ పెరుగుతుంది.

కీళ్ల నొప్పులు తగ్గాలంటే సోరకాయను ఆహారంలో ఉంచుకోవాలి. ఫైబర్, నీటికి మూలం. శరీరాన్ని చల్లగా, రిఫ్రెష్‌గా ఉంచుతుంది. టాక్సిన్స్‌ను బయటకు పంపుతుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.

సోరకాయ రసం యూరిక్ యాసిడ్ తగ్గించడంలో చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో గోరింటాకు రసం తాగడం వల్ల శరీరంలోని వ్యర్థాలు మొత్తం బయటకు వెళ్లిపోతాయి.

యూరిక్ యాసిడ్ తగ్గించడమే కాకుండా వేడి వాతావరణంలో శరీరాన్ని చల్లగా ఉంచడంలో సోరకాయ రసం ప్రభావవంతంగా ఉంటుంది. బరువు తగ్గడంలో కూడా సహాయపడుతుంది.

సోరకాయను ఉడకబెట్టి, పుల్లటి పెరుగు, ఉప్పు , కారం కలిపి తినవచ్చు. వేసవిలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడానికి ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది.

సోరకాయను ఉడకబెట్టి హల్వా కూడా చేసుకోవచ్చు. ఇది ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తుంది. శరీరంలో శక్తిని పెంచుతుంది.