రోజూ రెండు గ్రాములు నల్ల నువ్వులు తిన్నారంటే.. 

5 September 2023

రోజువారీ వంటకాలు, పిండి వంటల్లో కాసిన్ని నువ్వులు వేస్తే ఆ రుచే వేరబ్బ.. నవ్వుండల నుంచి అరిసెల వరకు రుచి అదరహో అనిపిస్తుంది. ఇవి రుచికే కాదండోయ్‌.. ఆరోగ్యానికీ మేలు చేస్తాయంటున్నారు నిపుణులు

నువ్వుల్లో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. రోజూ కాసిన్ని నువ్వులు తింటే శరీరంలో కొలెస్ట్రాల్‌, ట్రైగ్లిజరాయిడ్లు అదుపులో ఉంటాయి

నువ్వుల్లో మేలు చేసే కొవ్వులు గుండెజబ్బుల నుంచి రక్షణ కల్పిస్తాయని పలు అధ్యయనాలు ఇప్పటికే వెల్లడించాయి.

పచ్చి నువ్వులు తినడం కంటే వేయించిన నువ్వుల రుచి అమోఘంగా ఉంటుంది. పైగా వేయించిన నువ్వుల్లో మాంసకృత్తులు కూడా ఎక్కువేనట

ముఖ్యంగా కండరాల పుష్టికి, హార్మోన్లు మెరుగ్గా ఉండటానికీ నువ్వుల్లోని పోషకాలు ఎంతో మేలు చేస్తాయి. నువ్వులో మెగ్నీషియం పుష్కలంగా ఉండటమే అందుకు కారణం

నల్ల నువ్వులు రోజుకి రెండు గ్రాములు తీసుకుంటే చాలు గుండె కవాటాలు మూసుకుపోయే సమస్య నుంచి ఉపశమనం లభిస్తుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు

నువ్వుల్లో యాంటీఆక్సిడెంట్లు కూడా అధికంగా ఉంటాయి. అందుకే శీతకాలంలో నువ్వులు తింటే వ్యాధి నిరోధకశక్తిని పెంచి అనేక సీజనల్‌ వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తాయి. 

నువ్వుల్లో విటమిన్‌ బి, ఇ అధికంగా ఉంటుంది. ఫలితంగా చర్మం నిగారింపుని సంతరించుకుని కాంతులీనుతుంది. నువ్వుల్లో ఉండే లిగ్నాన్స్‌ బరువుని తగ్గించడమేకాకుండా హార్మోన్ల పని తీరుని మెరుగుపరుస్తుంది