అన్నం వార్చిన గంజి పారబోస్తున్నారా? ఇకపై అలా చేయకండి
19 December 2023
కొంతమంది అన్నం పొడిపొడిగా ఉండడానికి గంజిని వార్చి అన్నం వండుతుంటారు. కానీ ఇలా చేయడం వల్ల గంజితోపాటు పోషకాలూ వృథాగా పోతుంటాయి
అయితే అన్నం వార్చిన గంజిని ఇలా వృథాగా పారబోయకుండా పూర్వపు రోజుల్లో దాన్ని తక్షణ శక్తినిచ్చే ఆహారంగా భావించేవారు
గంజిలో కాస్త నిమ్మరసం, ఉప్పు కలిపి తాగితే మహిళలకు ఎన్నో రకాల ప్రయోజనాలందుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. అవేంటో తెలుసకుందాం
వయసు పెరిగే కొద్దీ ఒంట్లో శక్తి కూడా తగ్గిపోతుంది. చిన్నపనికే త్వరగా అలసిపోయి, నిస్సత్తువగా అనిపిస్తుంది. ఇలాంటి వాళ్లకు గంజి ఉపశమనం ఇస్తుంది
నీరసంగా అనిపించినప్పుడు కాస్త గంజి తాగితే శరీరంలోని ఎలక్ట్రోలైట్స్‌ని సమన్వయం చేసి తక్షణ శక్తిని ఇస్తుంది
కొంతమందికి ఏం తిన్నా అరగించుకోలేరు. ఇలాంటివారు రోజూ ఉదయాన్నే గ్లాసు గోరువెచ్చని గంజి తాగితే జీర్ణప్రక్రియ వేగం పుంజుకుంటుంది
కడుపు నొప్పి, ఇతరత్రా సమస్యలు ఏమైనా ఉన్నా దెబ్బకు ఎగిరిపోతాయి. గ్లాసుడు గంజి తాగితే నెలసరి నొప్పుల నుంచి కూడా ఉపశమనం పొందొచ్చు. ఒత్తిడీ, భావోద్వేగాలూ అదుపులో ఉంటాయి
గంజిలో విటమిన్ బి, ఐరన్, జింక్, మెగ్నీషియం వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక శక్తిని పెంచి, ఇన్‌ఫెక్షన్లు, వ్యాధులు రాకుండా నివారిస్తాయి