అధిక రక్తపోటు అదుపు చేసే జ్యూస్‌లు.. ఏమిటంటే 

30 November 2023

సిరల్లో రక్త ప్రసరణలో ఏర్పడే ఒత్తిడి అంటే రక్తపోటు ప్రభావితమైతే అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతాయి. సహజసిద్ధంగా బీపీని నియంత్రించడానికి ఈ జ్యూస్‌లు బెస్ట్. 

అధిక రక్త పోటు

కరివేపాకు రక్తపోటును అదుపులో ఉంచుతుంది. ఇందులో ఉండే మూలకాలు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. రోజూ కరివేపాకు నీరుని తినే ఆహారంలో చేర్చుకోండి 

కరివేపాకు

మునగ ఆకుల్లో ఉండే పొటాషియం బీపీని అదుపులో ఉంచుతుంది. మునగాకుని ఉడికించి జ్యూస్‌గా చేసుకుని పరగడుపున తాగాలి.

మునగ ఆకులు

ఉసిరి, అల్లం లు వంటింట్లో ఔషదాల గని. వీటి రసం తాగడం వలన ఆక్సీకరణ జరిగి ఒత్తిడి తగ్గుతుంది. ఉదయం  అల్పాహారం తర్వాత ఉసిరి అల్లం రసాన్ని తాగడం మేలు 

ఉసిరి అల్లం రసం 

బీట్‌రూట్‌లో నైట్రేట్ హై బీపీని తగ్గిస్తుంది. టొమాటోలో బీటా కెరోటిన్ , విటమిన్ ఇ వంటివి అధికం. బీపీతో ఇబ్బంది పడేవారికి ఈ రసం బెస్ట్ మెడిసిన్ 

టొమాటో, బీట్‌రూట్ జ్యూస్

ధనియాల రసం తాగడం వల్ల శరీరంలోని అదనపు సోడియం శరరం నుంచి బయటకు వెలువడుతుంది. దీంతో బీపీ స్థాయి అదుపులో ఉంటుంది.

ధనియాల రసం 

బ్లాక్ బెర్రీ అంటే నేరేడులో యాంటీ ఆక్సిడెంట్లు అధికం. దీని జ్యూస్ తాగడం వల్ల బీపీ, చెడు కొలెస్ట్రాల్  నియంత్రణలో ఉంటాయి.  

నేరేడు రసం