30 March 2024
TV9 Telugu
Pic credit - Pexels
రక్తంలో చక్కెర స్థాయి 100 దాటిందా? మధుమేహం తలుపు తడుతుందా? కంగారుపడవద్దు కొంచెం జాగ్రత్తగా ఉంటే ఆరోగ్యంగా ఉండొచ్చు.
ప్రీ-డయాబెటిస్‌తో జాగ్రత్తగా ఉండకపోతే టైప్-2 డయాబెటిస్ బారిన పడవచ్చు. ఇది చాలా ఆరోగ్య సమస్యలకు దారి తీయవచ్చు
మొత్తం జీవనశైలి, రోజువారీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవాలి. ఆహారం మార్చుకోవడం కూడా చాలా ముఖ్యం.
ప్రతిరోజూ కనీసం 30 ని. శారీరక శ్రమ చేయాలి. నడక, సైకిల్ తొక్కడం, యోగా, స్విమ్మింగ్, వ్యాయామం చేయడం మంచిది.
ఆహారంలో ఎక్కువ ఫైబర్-రిచ్ ఫుడ్స్ తినండి. ఇది రక్తంలోకి చక్కెర నెమ్మదిగా విడుదల చేయడానికి సహాయపడుతుంది.
రక్తంలో చక్కెర స్థాయి 100కి చేరుకుంటే తినే ఆహారం మార్చుకోవాలి. చక్కెరకు పూర్తిగా దూరంగా ఉండాలి. బదులుగా మీరు తేనె లేదా బెల్లం తీసుకోవచ్చు.
ప్రీ-డయాబెటిస్‌తో బాధపడుతుంటే వెంటనే మద్యం, ధూమపానం, గుట్కాతో సహా పొగాకును వదిలివేయాలి. ప్యాక్ చేసిన పానీయాలు తీసుకోవద్దు.
మధుమేహం పూర్తిగా అదుపులోకి వచ్చేలోపు వైద్యుడిని సంప్రదించండి. రక్తంలో చక్కెర స్థాయిలను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోండి