20 February 2024
TV9 Telugu
Pic credit - Pexels
దాదాపు ప్రతి వ్యక్తి ఊపిరితిత్తుల ఆరోగ్యం క్షీణిస్తూనే ఉంది. శ్వాస తీసుకోవడంలో ఇబ్బందిని ఎదుర్కొంటున్నట్లయితే ఖచ్చితంగా ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సంబంధించిన పరీక్షలు చేయించుకోండి.
గత కొన్నేళ్లుగా ఊపిరితిత్తుల ఆరోగ్యం దెబ్బతిని బాధపడుతున్న రోగుల సంఖ్య గణనీయంగా పెరిగింది. దీనికి కారణం లంగ్స్ లో నెమ్ము, కఫం పేరుకుపోవడమే. ఈ హోం రెమెడీస్‌తో శుభ్రం చేసుకోవచ్చు.
పసుపులో కర్కుమిన్ ఉంటుంది. ఇందులో యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ సెప్టిక్, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి. దీంతో శ్వాసకోశ వ్యవస్థ మెరుగుపడుతుంది. ప్రతిరోజూ ఈ వేడి నీటిని తాగండి
బీట్‌రూట్‌ను తింటే శరీరంలోని రక్తహీనత నయమవుతుంది. ఇందులో చాలా విటమిన్లు, యాంటీఆక్సిడెంట్లు ఉంటాయి. రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
కూరగాయలను తినడం చాలా ముఖ్యం. అయితే లంగ్స్ ఆరోగ్యం కోసం పిండి లేని కూరగాయలను తినాలి. తినే ఆహారంలో బ్రోకలీ, క్యారెట్ వంటి కూరగాయలను చేర్చుకోవచ్చు.
ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ప్రొటీన్ ఫుడ్ తీసుకోవాలి. పప్పులు, కూరగాయలు వంటి సూపర్‌ఫుడ్‌లో ప్రోటీన్లు ఉంటాయి.
ఊపిరితిత్తుల్లో ఉన్న నెమ్ము, కఫం శుభ్రం చేయాలంటే వీలైనంత ఎక్కువ నీరు తాగాలి. అయితే ఈ ఇంటి చిట్కాలను అనుసరించే ముందు ఖచ్చితంగా డాక్టర్ లేదా నిపుణుల సలహా తీసుకోండి.