16 September 2023
మనం తినే ఆహారానికి, మన ఆరోగ్యంతో ప్రత్యక్ష సంబంధం ఉంటుంది. కల్తీ వస్తువులు మనల్ని అనారోగ్యానికి గురిచేస్తాయి. కాబట్టి మనం ఏది తిన్నా అది నాణ్యమైనదిగా ఉండాలి.
ప్రస్తుత కాలంలో రోజువారీగా ఉపయోగించే నిత్యావసర వస్తువుల నుండి ఆహారాల వరకు చాలా విషయాలలో కల్తీ కనిపిస్తుంది. గరం మసాలా, తడ్కాలో ఉపయోగించే జీలకర్ర కూడా కల్తీ కావడం మొదలైంది.
మీ ఇంట్లో ఉండే జీలకర్రలో కల్తీ ఉందా లేదా అనేది కొన్ని సాధారణ పరీక్షల ద్వారా గుర్తించవచ్చు. అది ఎలాగో తెలుసా?
జీలకర్ర నిజమైనదా? కాదా? అని తనిఖీ చేయడానికి.. మీ చేతికి కొద్దిగా జీలకర్ర తీసుకొని దాని వాసనను చెక్ చేయండి. జీలకర్ర నిజమైనది అయితే అది ఘాటైన వాసన వస్తుంది.
జీలకర్రను కాసేపు నీళ్లలో నానబెట్టాలి. కొంత సమయం తర్వాత ఆ జీలకర్ర రంగు రావడం ప్రారంభిస్తే.. దానిని కల్తీ చేసినట్లు గుర్తించాలి.
కొద్దిగా జీలకర్రను చేతిలోకి తీసుకుని బాగా నలపండి. అయినప్పటికీ జీలకర్రలో మార్పు రాకపోతే.. అది నిజమైనది. లేదంటే అది కల్తీ చేసినట్లు గుర్తించవచ్చు.
ప్రస్తుత కాలంలో ప్రతీది కల్తీ అవుతుంది. అందుకే.. మీరు ఏదైనా ఆహారం, ఇతర పదార్థాలను తినాలనుకుంటే.. వాటి నాణ్యతను చెక్ చేయండి.