నిత్యం నవయవ్వనంగా, అందంగా కనిపించాలని కోరుకోని వారుండరు. అందుకోసం రకరకాల సప్లిమెంట్లు తీసుకుంటుంటారు
అయితే ఈ ఒక్కటి తింటే ఏకంగా 50 యేళ్లు యవ్వనంగా ఉండొచ్చంటున్నారు ఆరోగ్య నిపుణులు. అదే.. బ్రకోలీ
శీతాకాలంలో పుష్కలంగా లభించే బ్రకోలీలో ఫైబర్, విటమిన్ సి, విటమిన్ కె, ఐరన్, పొటాషియం వంటి అనేక పోషకాలు అధికంగా ఉంటాయి
బ్రకోలీని ప్రతిరోజూ తినడం వల్ల ఆరోగ్యాన్ని మెరుగుపరచడంతోపాటు చర్మాన్ని యవ్వనంగా ఉంచుతుంది. విటమిన్ సి, కె, ఫోలేట్, ఫైబర్ సమృద్ధిగా ఉండే బ్రకోలీ శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది
దీనిలోని పోషకాలు రక్తం గడ్డకట్టడాన్ని నివారిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కూడా ప్రోత్సహిస్తుంది. దీనిలోని యాంటీ ఆక్సిడెంట్ లక్షణాలు దీర్ఘకాలిక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది
బ్రకోలీలో సల్ఫోరాఫేన్ సమృద్ధిగా ఉండటం వల్ల హానికరమైన సమ్మేళనాలను తటస్థీకరిస్తుంది. క్యాన్సర్ వంటి ప్రమాదకరమైన వ్యాధుల ప్రమాదాన్ని కూడా తగ్గిస్తుంది
దీనిలోని ఫైబర్ జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి ఆకలిని నియంత్రిస్తుంది. తద్వారా సులువుగా బరువు కూడా సులువుగా తగ్గడానికి సహాయపడుతుంది
బ్రకోలీని ఆవిరిపై ఉడికి తినడం వల్ల మరిన్ని ఆరోగ్య ప్రయోజనాలు పొందవచ్చు. సలాడ్‌లో బ్రకోలీని జోడించడం వల్ల రుచితోపాటు, ఆరోగ్యం కూడా మీసొంతమవుతుంది