28 February 2024
TV9 Telugu
Pic credit - Pexels
అనేక సందర్భాల్లో మహిళలు మూత్రవిసర్జనను ఆపుకుంటూ ఉంటారు. ప్రయాణం చేసే సమయంలో నీరు తాగరు. టాయిలెట్స్ వసతి ఉండదు.. ఉన్నా కానీ శుభ్రంగా ఉండవు అందుకని మూత్రవిసర్జన ఆపుకుంటారు
ఎటువంటి పరిస్తితిలో ఉన్నా.. టాయిలెట్‌కు వెళ్లడంలో జాప్యం చేయరాదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మూత్రాశయం నిండినప్పుడు మూత్ర విసర్జన చేయకపోవడం ప్రమాదకరమని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ముత్ర విసర్జన ఆలస్యం చేస్తే శరీరంలోని వ్యర్థ పదార్థాలు కాల్షియం సమ్మేళనాలుగా మారి కిడ్నీలో రాళ్లు ఏర్పడతాయి. కిడ్నీ స్టోన్స్ వలన ఇన్ఫెక్షన్, మూత్రంలో రక్తం పడుతుంది.
మూత్రనాళంలో ఉండే బ్యాక్టీరియాతో మూత్రాన్ని ఎక్కువ సేపు ఆపుకుంటే యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ బారిన పడతారు. ఒక్కసారి యూటీఐ ఇన్ఫెక్షన్ వస్తే మళ్లీ మళ్లీ వచ్చే అవకాశం అధికం.
మనిషి మూత్రశయం 300 నుంచి 600 ఎంఎల్ వరకు మూత్రాన్ని నిలువ ఉంచుకోగలదు. మూత్రాన్ని ఎక్కువ కాలంపాటు ఆపుకుంటే బ్లాడర్ పగిలిపోవచ్చు. అప్పుడు ఉదరం నిండా మూత్రం చేరి ప్రమాదకరంగా మారవచ్చు
మూత్రాన్ని ఆపితే కండరాలు బిగుతుగా మారి తీవ్రమైన నొప్పి వస్తుంది. మూత్రాశయంలో నిలువ ఉండే మూత్రము 6 గంటలు దాటితే బ్యాక్టీరియల్ మల్టిప్లికేషన్ జరిగి ఇన్ఫెక్షన్ వచ్చే ఛాన్స్ చాలా ఎక్కువ
ఎక్కువ సమయం పాటు మూత్రాన్ని ఆపుకుంటే పెల్విక్ ఫ్లోర్ కండరాలు బలహీనపడతాయి. కనుక మహిళలు ప్రతి 3 గం. ఒకసారి లేదా 6 గం. లోపల ముూత్ర విసర్జన కంపల్సరిగా చేయాలి
ఆరోగ్యవంతమైన శరీరానికి నీరు కూడా ఎక్కువ తక్కువ కాకుండా తాగాలి. రోజుకు 1.5 నుండి 2.5 లీటర్ల నీరు అవసరం. ఇంతకంటే ఎక్కువ నీళ్లు తాగితే పదే పదే మూత్ర విసర్జన చేయాల్సి వస్తుంది