నిత్యం ఒత్తిడితో ఇబ్బందిపడే వారికి తలనొప్పి సాధారణ సమస్యగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా తలనొప్పి వేధిస్తుంటే ఒత్తిడితో చిత్తవుతున్నట్లే.
మానసిక ఆరోగ్యంపై పడే ప్రభావం వ్యాధి నిరోధక శక్తిపై కూడా చెడు ప్రభావం చూపుతుంది. దీంతో తరచూ జ్వరం, జలుబు వంటి సమస్యలు వెంటాడుతుంటాయి.
అధిక ఒత్తిడి కారణంగా చర్మ సంబంధిత సమస్యలు కూడా వస్తాయని నిపుణులు చెబుతున్నారు. శరీరంలో హార్మోన్ల సమతుల్యత దెబ్బతినడం వల్ల చర్మంపై నల్లటి మచ్చలు ఏర్పడుతాయని చెబుతున్నారు.
ఎక్కువ ఒత్తిడికి గురికావడంతో గుండె సమస్యలు వచ్చే అవకాశాలు పెరుగుతాయని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ కాలం ఒత్తిడికి గురైతే హార్ట్ బీట్ పెరిగి గుండెపోటు వచ్చే అవకాశం ఉంటుంది.
ఎక్కువ కాలం ఒత్తిడితో ఇబ్బందిపడే వారు బరువు పెరుగుతారని పరిశోధనల్లో వెల్లడైంది. దీనికి కారణంగా ఒత్తిడిలో ఎక్కువగా ఆహారం తీసుకోవడమే.
ఒత్తిడి కారణంగా మెదడు ఆరోగ్యం దెబ్బతింటుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంలో అల్జీమర్స్ వచ్చే సమస్య పెరుగుతుంది
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.