TV9 Telugu
15 March 2024
ఎండలో పిల్లలు జాగ్రత్త..
ఎండలు పెద్దలతో పోల్చితే చిన్నారులపై మరింత ప్రభావం చూపుతుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. అందుకే చిన్నారుల విషయంలో మరింత జాగ్రత్తగా ఉండాలి.
మధ్యాహ్నం ఎట్టి పరిస్థితుల్లో చిన్నారులను బయటకు పంపించకూడదు. మరీ ముఖ్యంగా ఉదయం 11 నుంచి సాయంత్రం 6 గంటలకు వరకు.
చిన్నారులు డీ హైడ్రేషన్‌కు గురయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి వారికి నిత్యం ఏదో ఒక డ్రింక్ ఇస్తుండాలి. తరచూగా నీటిని తాగిస్తుండాలి.
కొబ్బరి బోండాలు, ఓఆర్‌ఎస్, మజ్జిగ వంటి వాటిని అందిస్తూ ఉండాలి. అలాగే నీటి శాతం ఎక్కువగా ఉండే పండ్లను ఇవ్వాలి.
ఇక వేసవిలో చిన్నారులకు స్విమ్మింగ్ పూల్స్‌కి పంపించాలి. అయితే కచ్చితంగా ముందుకు సదరు స్విమ్మింగ్ పూల్ రక్షణ చర్యలు ఎలా ఉన్నాయో చూసుకోవాలి.
ఇక వేసవిలో చిన్నారులకు కాటన్ దుస్తులను ధరింపజేయాలి. ఎట్టి పరిస్థితుల్లో బ్లాక్ డ్రస్‌లను వేయకూడదు. లైట్ కలర్ డ్రస్‌లనే వేయాలి.
ఒకవేళ తప్పనిసరి పరిస్థితుల్లో ఎండలో వెళ్లాల్సి వస్తే కచ్చితంగా క్యాప్‌ను లేదా టవల్‌ను తలపై ధరించి తీసుకెళ్లాలి. వీలైనంత వరకు నీడ పట్టున ఉండాలి.
పైన తెలిపిన విషాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..