ఇది తెలిస్తే వెంటనే
యోగా స్టార్ట్ చేస్తారు..
20 October 2023
యోగా అనేది కేవలం శారీరక క్రియ మాత్రమే కాదు. నిత్యం యోగాను ఆచరించడం వల్ల మానసిక ఆరోగ్యాన్ని సైతం సొంతం చేసుకోవచ్చు. యోగా వల్ల మనసు నిర్మలంగా మారుతుంది.
ఎన్నో రకాల వ్యాధులకు యోగాతో చెక్ పెట్టొచ్చు. శ్వాసకోస సంబంధిత వ్యాధులు మొదలు, పలు రకాల శారీరక సమస్యలకు యోగా ఒక దివ్యౌషధంగా పనిచేస్తుంది.
యోగా వల్ల ఏకాగ్రత పెరుగుతుంది. కొందరు నిత్యం ఏదో ఒక ఆందోళనతో ఉంటారు. అలాంటి వారు క్రమం తప్పకుండా యోగా సాధన చేస్తే ఏకాగ్రతను పెంచుకోవచ్చు.
యోగాను జీవితంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది. దీంతో తీసుకునే నిర్ణయాలు సరిగ్గా తీసుకుంటాం. ఎలాంటి తప్పులు చేసే అవకాశం ఉండదు.
కండరాలు ధృడంగా మారడంలో యోగాది కీలక పాత్ర. యోగాను జీవితంలో ఓ భాగం చేసుకోవడం వల్ల శారీరకంగా బలంగా మారుతాం. నీరసం అనేది దరి చేరదు.
యోగాలో పద్మాసనం వేయడం వల్ల శ్వాసక్రియ మెరుగవుతుంది. శరీరంలో రక్త ప్రసరణ పెరుగుతుంది. క్రమంతప్పకుండా ఈ ఆసనం వేస్తే పొట్టలోని కొవ్వు తగ్గుతుంది.
రోజు ఉదయం కనీసం 30 నిమిషాల పాటు యోగం చేసుకోవడం అలవాటు చేసుకునే తక్కువ సమయంలోనే మార్పు గమనించవచ్చు. యోగాతో పాటు మంచి ఆహారం తీసుకోవాలి.
యోగా చేయడం వల్ల శరీరానికి కొత్త ఉత్సాహం వస్తుంది. శరీరాన్ని బలంగా మారుస్తుంది. అలాగే కీళ్లను ఆరోగ్యంగా ఉంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుంది.
ఇక్కడ క్లిక్ చేయండి..