పుచ్చకాయ గింజలు ఎముకులను ధృడంగా మార్చడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని కాపర్, మాంగనీస్, పొటాషియం ఎముకలను బలంగా మార్చడంలో ఉపయోగపడతాయి.
ఈ గింజల్లోనే ఫొలేట్, ఐరన్, జింక్, కాపర్, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది జీవక్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
పుచ్చకాయ గింజలను డయాబెటిక్‌ను కంట్రోల్ చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్ ఏ,సీ, బి6లు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గిస్తాయి.
పుచ్చకాయ గింజలు గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని మనో అన్‌శ్యాచురేటెడ్, పాలీ అన్‌శ్యాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ గుండెపోటు సమస్యల నుంచి రక్షిస్తుంది.
పుచ్చకాయ గింజల్లో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. ఇది మెదడు పనితీరును మెరుగుపరచడంతో పాటు, జ్ఞాపకశక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
పుచ్చకాయ గింజల్లో యాంటీఆక్సెడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ నష్టం నుంచి కణాలను రక్షించడానికి ఉపయోగపడతాయి. దీంతో రోగ నిరోధక శక్తి బలోపేతం అవుతుంది.
ఈ గింజలను తీసుకోవడం వల్ల రక్తపోటు సమస్య దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ప్రోటీన్, అమినో యాసిడ్స్ రక్తపోటు తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.