డయాబెటిస్ రోగులకు వాటర్ యాపిల్ వరం లాంటిదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ హైపెర్గ్లైసీమిక్ లక్షణాలు రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు.
డీ హైడ్రేషన్ సమస్య బారిన పడకుండా కూడా ఈ పండు ఉపయోగపడుతుంది. ముఖ్యంగా వింటర్‌లో నీళ్లు తక్కువగా తీసుకుంటారు. కాబట్టి ఈ సమయంలో ఈ పండును తీసుకుంటే సమస్య దూరమవుతుంది.
వాటర్ యాపిల్‌లో నీటి శాతం పుష్కలంగా ఉంటుంది. ఇది ఊబకాయంతో బాధపడేవారికి ఎంతగానో ఉపయోగపడుతుంది. అలాగే ఇందులోని ఫైబర్ కంటెంట్ కూడా బరువు తగ్గడంలో ఉపయోగపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా వాటర్ యాపిల్ ఎంతో ఉపయోగపడుతుంది. వాటర్ యాపిల్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
వాటర్ యాపిల్‌లో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది అధిక రక్తపోటు సమస్యను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది. తరచూ ఈ పండును తీసుకుంటే రక్తపోటు తగ్గుతుంది.
తరచూ వ్యాధుల బారిన పడకుండా రక్షించడంలో కూడా వాటర్ యాపిల్ ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్ సి రోగ నిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో ఉపయోగపడుతుంది.
చర్మ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా వాటర్ యాపిల్ ఎంతో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే ఇందులోని విటమిన్ మెటబాలిజంను పెంపొందించడంలో ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.