వాల్‌నట్స్‌తో ఇన్ని లాభాలున్నాయా.? 

Narender Vaitla

09 October 2024

వాల్‌నట్స్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని విటమిన్‌ బి చర్మాన్ని సంరక్షిస్తుంది

మానసిక ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా వాల్‌నట్స్‌ క్రీయాశీలకంగా ఉపయోగపడతాయి. ఇందులో సహజ యాంటీ ఆక్సిడెంట్‌ విటమిన్‌ ఇ ఉంటుంది. ఇది ఒత్తిడి వల్ల కలిగే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది.

జుట్టు ఆరోగ్యాన్ని రక్షించడంలో కూడా వాల్‌నట్స్‌ కీలక పాత్ర పోసిస్తాయి. ఇవి జుట్టు కుదుళ్లను బలోపేతం చేయడంలో, జుట్టు రంగును కాపాడడంలో ఉపయోగపడుతాయి.

జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరకుండా ఉండాలంటే వాల్‌నట్స్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.

డయాబెటిస్‌తో బాధపడేవారు ప్రతీరోజూ వాల్‌నట్స్‌ను తీసుకోవాలి. ఇవి రక్తంలో చక్కెరను తగ్గించడంలో సహాయపడతాయి. డయాబెటిస్‌ ప్రమాదాన్ని తగ్గిస్తాయి

వాల్‌నట్స్‌లో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి రక్తపోటును కంట్రోల్‌ చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా వాల్‌నట్స్‌ ఉపయోగపడతాయి. ఇందులోని ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్‌.. శరీరంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.