ప్రతీ రోజూ వాకింగ్ చేయడం వల్ల కీళ్ల నొప్పుల నుంచి ఉపశమనం లభిస్తుంది. వాకింగ్ వల్ల కీళ్లలో ఉండే లిక్విడ గమ్ పెరిగి కీళ్ల నొప్పులు దూరమవుతాయి.
ఊబకాయం సమస్యతో బాధపడేవారు ప్రతీ రోజూ వాకింగ్ అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు నడవడం వల్ల చాలా వరకు మెరుగైన ఫలితం ఉంటుంది.
రోగ నిరోధక శక్తిని పెంచడంలో కూడా వాకింగ్ బాగా ఉపయోగపడుతుంది. ప్రతీరోజూ 20 నిమిషాలు వాకింగ్ చేయడం వల్ల ఇమ్యూనిటీ సుమారు 43 శాతం పెరుగుతుంది.
మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని తగ్గించడంలో వాకింగ్ ఉపయోగపడుతుంది. వాకింగ్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ వచ్చే ఆ సమస్య 15 శాతం తగ్గుతుందని అంటున్నారు.
ఒత్తిడితో ఇబ్బందిపడే వారు కూడా ప్రతీ రోజూ వాకింగ్ చేయడాన్ని అలవాటుగా మార్చుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కనీసం 30 నిమిషాలు వాకింగ్ చేస్తే ఒత్తిడి దూరమవుతుంది.
రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో వాకింగ్ ఉపయోగపడుతుంది. ప్రతీ రోజూ వాకింగ్ చేసే వారిలో షుగర్ లెవల్స్ కంట్రోల్‌లో ఉంటాయి
గుండె ఆరోగ్యానికి కూడా వాకింగ్ చాలా మంచిదని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ వాకింగ్ అలవాటుగా మార్చుకుంటే అధిక రక్తపోటు సమస్య దూరమవుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.