ఖాళీ కడుపుతో పసుపు నీటిని తీసుకంటే బరువు తగ్గొచ్చని నిపుణులు చెబుతున్నారు. స్థూలకాయం సమస్యతో బాధపడేవారికి ఇది బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.
జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడేవారికి కూడా పసుపు నీరు బాగా ఉపయోగపడుతుంది. పొట్ట శుభ్రమై, జీర్ణక్రియ మెరుగుపడుతుంది.
ప్రతీ రోజూ ఉదయం పడగడుపున పసుపు కలిపిన నీటిని తాగడం వల్ల శరీరంలో మంటను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
చర్మ సంబంధిత సమస్యల నుంచి బయటపడడంలో పసుపు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇదులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మానికి మేలు చేస్తాయి. ఇది ఫ్రీ రాడికల్స్, సెల్ డ్యామేజ్ నుంచి చర్మాన్ని రక్షిస్తుంది
రోగ నిరోధక శక్తిని పెంచడంలో పసుపు కీలక పోత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు వ్యాధుల బారిన కాపాడకుండా ఉపయోగపడుతుంది
నోటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పసుపు నీరు ఉపయోగపడుతుంది. పసుపులో ఉండే యాంటీ బ్యాక్టీరియా లక్షణాలు నోట్లో బ్యాక్టీరియా వృద్ధిని తగ్గిస్తుంది.
వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పుల సమస్యకు పసుపు, నీళ్లు బాగా ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. పడగడుపున పసుపు నీళ్లు తాగితే ఎంతో మేలు జరుగుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.