టోఫును క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల మహిళల్లో నెలసరి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఇందులోని ఈస్ట్రోజెన్ హార్మోన్ నెలసరి సమయాల్లో వచ్చే సమస్యలను దూరం చేస్తుంది.
టోఫులో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇందులోని పోషకాలు క్యాన్సర్‌ను నిరోధించే గుణాలు ఉంటాయి. దీంతో రొమ్ము, కడుపు క్యాన్సర్ వంటివి దరిచేరవు.
రోగనిరోధక వ్యవస్థను బలోపేతం చేయడంలో టోఫు ఉపయోగపడుతుంది. ఇందులోని జింక్ గాయాలు నయం కావటానికి సహాయపడుతుంది. 122 గ్రాముల టోఫులో 2 మిల్లీగ్రాముల జింక్ లభిస్తుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో టోఫు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో తక్కువ కొవ్వు ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి.
బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా టోఫును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నింపిన భావన కలిగేలా చేస్తుంది.
టోఫులో క్యాల్షియం కూడా పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో సహాయపడుతుంది. ఆస్టియోపోరోసిస్ వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
మధుమేహంతో బాధపడేవారికి కూడా టోఫు ఎంతగానో ఉపయోగపడుతుంది. రక్తంలో చక్కెర స్థాయిలను అదుపు చేయడంలో టోఫు బాగా ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.