డయాబెటిస్ పేషెంట్స్‌కు తిప్పతీగ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. రక్తంలో గ్లూకోజ్ స్థాయిలను కంట్రోల్ చేయడంలో తిప్పతీగ సహాయపడుతుంది. సహజ ఇన్సులిన్ స్రావాన్ని పెంచడంలో ఉపయోగపడుతుంది.
ఇందులోని యాంటీ పైరేటిక్ లక్షణం దీర్ఘకాలిక జ్వరాలతో పోరడడానికి సహాయపడుతుంది. డెంగ్యూ ఉన్న సమయంలో తిప్ప తీగ తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది.
తిప్ప తీగను నీటిలో వేసి వేడి చేసిన నీటిని తీసుకుంటే లివర్ ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ కాలేయ వ్యాధిని ఎదుర్కోవడంలో ఉపయోగపడుతుంది.
ఇందులోని యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు దగ్గు, జలుబు, టాన్సిలిటిస్ వంటి సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఛాతీ బిగుతుగా ఉన్న వారికి ఉపయోగపడుతుంది.
మానసిక ఆరోగ్యాన్ని కూడా మెరుగుపరుస్తుంది. ఇందులోని అడాప్టోజెన్ ఒత్తిడిని దూరం చేయడంలో సహాయపడుతుంది. బీపీని కంట్రోల్ చేస్తుంది.
గుండె సంబంధిత వ్యాధుల బారిన పడకుండా ఉండాలంటే తిప్పతీగను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని మంచి గుణాలు గుండెకు పరోక్షంగా ప్రయోజనం చేకూరుస్తాయి.
ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా తిప్పతీగ ఉపయోగపడుతుంది. ముఖ్యంగా బోలు ఎముకల వ్యాధిని దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.