నల్ల ద్రాక్షను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల మలబద్ధకం, రక్తపోటు, జుట్టు నెరిసిపోవడం వంటి సమస్యలకు చెక్ పెట్టొచ్చు. ఎముకల ఆరోగ్యానికి మేలు చేస్తాయి.
నల్ల బియ్యం కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. ఇందులో ఉండే ల్యూటిన్, జియాంథిన్ కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నల్ల నువ్వులతో కూడా ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరచడంలో ఉపయోగపడతాయి.
మినుములను నల్ల పప్పుగా చెబుతుంటారు. ఇందులోని ఎన్నో ఔషధ గుణాలు ఆరోగ్యాన్ని ఎంతో మేలు చేస్తాయి. నల్ల పప్పును తీసుకుంటే.. శరీరంలో కొవ్వు స్థాయులను అదుపులో ఉంచుకోవచ్చు.
మార్కెట్లో అందులో ఉన్న నల్ల వెల్లుల్లి కూడా ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ క్యాన్సర్ కారకాలుగా పనిచేస్తాయని నిపుణులు చెబుతున్నారు.
నల్ల పుట్టగొడుగులు లివర్, పొట్ట ఆరోగ్యాన్ని కాపాడుతాయి. రోగ నిరోధక శక్తి పెంచడంలో కూడా ఇవి ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.
ఇక నల్ల మిరియాలు కూడా ఆరోగ్యాన్ని రక్షిస్తాయి. కొవ్వును, చక్కెర స్థాయుల్ని అదుపు చేసే గుణాలున్నాయంటున్నారు వైద్యనిపుణులు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.