చక్కెర తక్కువ తీసుకుంటే ఏమవుతుందో తెలుసా.? 

Narender Vaitla

18 Aug 2024

చక్కెరను మోతాదుకు మించి తీసుకోవడం వల్ల లివర్‌ ఆరోగ్యం పాడవుతుందని నిపుణులు చెబుతున్నారు. లివర్‌ ఆరోగ్యంగా ఉండాలంటే చక్కెరను మితంగా తీసుకోవాలి.

చర్మ సంబంధిత సమస్యల కూడా చక్కర కారణమని నిపుణులు చెబుతున్నారు. చక్కెర ఎక్కువగా తిటే.. చర్మం జిడ్డుగా మారుతుంది. మొటిమలు పెరుగుతాయి.

చక్కెర ఎక్కువగా తీసుకోవడం వల్ల ఇన్సులిన్ నిరోధకతకి దారితీస్తాయి. ఇది ప్రీ డయాబెటిస్, టైప్ 2 డయాబెటిక్‌కి కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు.

దంతాల సమస్యకు కూడా చక్కెర కారణమవుతుందని నిపుణులు చెబుతున్నారు. అలాగే చిగుళ్ల సమస్యలకు కూడా చక్కెర కారణమవుతుంది. కాబట్టి నోటి ఆరోగ్యం కోసం చక్కెర తగ్గించాలి.

గుండె జబ్బులకు కూడా చక్కెర కారణమవుతుతందని నిపుణులు చెబుతున్నారు. చక్కెర కారణంగా శరీరంలో ట్రైగ్లిజరైడ్స్ పెరుగుతాయి. ఇవి గుండె జబ్బులకు దారి తీస్తాయి. 

బరువు పెరగడానికి ప్రధాన కారణాల్లో చక్కెర కంటెంట్‌ ఎక్కువగా తీసుకోవడం కూడా ఒకటని నిపుణులు చెబుతున్నారు. బరువు తగ్గాలనుకునే వారు చక్కెర కంటెంట్‌ను తగ్గించాలి. 

చక్కెరను తక్కువగా తీసుకుంటే.. క్యాన్సర్‌ దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. శరీరంలోని ఫ్రీ రాడికల్స్‌ను పెంచడంలో చక్కెర పాత్ర ఎక్కువగా ఉంటుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధిచి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.