09 July  2024

ధర ఎక్కువని ముఖం తిప్పుకోకండి.. 

Narender.Vaitla

స్ట్రాబెర్రీల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇది క్యాన్సర్‌ ప్రమాదాన్ని తగ్గించడంలో ఉపయోగపడుతుంది. శరీరంలో క్యాన్సర్‌ కణాల వ్యాప్తిని అడ్డుకుంటుంది.

ఇందులో ఫ్రక్టోజ్ తక్కువ శాతం ఉంటుంది. అందుకే డయాబెటిస్‌ పేషెంట్లు ఎలాంటి భయం లేకుండా వీటిని తీసుకోవచ్చు. తియ్యగా ఉన్నా డయాబెటిస్‌ వ్యాధిగ్రస్తులకు ఎలాంటి ఇబ్బంది ఉండదు.

కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా స్ట్రాబెర్రీ ఉపయోగపడుతుంది. ఇందులోని యాంటీఆక్సిడెంట్‌ కంటి శుక్లాలను నివారించడంతో క్రీయాశీలకంగా పనిచేస్తుంది.

దంత సమస్యలను నివారించడానికి ఇవి పనిచేస్తాయి. దంతాలపై ఉండే పసుపు పొరను తొలగించేందుకు స్ట్రాబెర్రీ ఉపయోగపడుతుంది. దంతాల్లో ఎంజైములు ఏర్పడకుండా చేస్తుంది.

అధిక రక్తపోటుతో బాధపడేవారు ప్రతీ రోజూ ఒక స్ట్రాబెర్రీని కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని పొటాషియం రక్తపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది.

భవిష్యత్తుల్లో గుండె సంబంధిత సమస్యలు రాకుండా ఉండాలంటే స్ట్రాబెర్రీలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పాలీఫెనాల్స్ సమ్మేళనం గుండెను ఆరోగ్యంగా ఉంచచుతుంది.

స్ట్రాబెర్రీలు ఫైబర్‌ కంటెంట్‌కు పెట్టింది పేరు. ఇందులో నీటిశాతం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునే వారికి స్ట్రాబెర్రీ బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.