08 June 2024

పాలకూర జ్యూస్‌ తాగితే ఏమవుతుంతో తెలుసా.? 

Narender.Vaitla

పాలకూర జ్యూస్‌ను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఇందులోని గుణాలు దీర్ఘకాలిక వ్యాధుల నుంచి రక్షణ కల్పిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పాలకూర జ్యూస్ తాగడం వల్ల కంటి ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆకు కూరల్లోని విటమిన్‌ ఎ కంటి చూపుతో పాటు రక్త హీనతను నివారించడానికి సహాయపడుతుంది.

చర్మం ఆరోగ్యంగా, కాంతివంతంగా మారాలంటే పాలకూర జ్యూస్‌ను క్రమం తప్పకుండా తీసుకోవాలి. ఈ జ్యూస్‌ యాంటీ ఏజింగ్‌ డ్రింక్‌గా పనిచేస్తుంది. ఇది యవ్వనంగా ఉండడంలో ఉపయోగపడుతుంది.

రక్తపోటుతో బాధపడేవారికి కూడా పాలకూర జ్యూస్‌ ఎంతగానో ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో సహజంగా లభించే నైట్రేట్‌లు రక్తనాళాలను విస్తరించడంలో ఉపయోగపడతాయి.

పాలకూరలో విటమిన్‌ కె, ఎ, మాంగనీస్‌, ఐరన్‌, జింక్‌ వంటి పోషకాలు జుట్టు పెరుగుదలకు ఎంతగానో ఉపయోగడుతుంది. క్రమం తప్పకుండా పాలకూర జ్యూస్‌ తీసుకుంటే జుట్టు ఒత్తుగా, పొడువుగా పెరుగుతుంది.

క్యాన్సర్‌ మహమ్మారికి చెక్‌ పెట్టడంలో కూడా పాలకూర జ్యూస్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది. పాలకూరలోని పోషకాలు క్యాన్సర్‌ కణాల పెరుగుదలను అడ్డుకుంటాయి.

పాలకూరలో ఫైబర్‌ కంటెంట్‌ అధికంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఉపయోగపడుతుంది. మలబద్ధకం, అల్సర్‌, కడుపు ఉబ్బరం వంటి వాటికి పాలకూర జ్యూస్‌తో చెక్‌ పెట్టొచ్చు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే.