11 July  2024

మార్కెట్‌కి వెళ్తే.. పాలకూర కచ్చితంగా కొనండి. 

Narender.Vaitla

పాలకూరను ఆహారంలో భాగం చేసుకోవడం ద్వారా వయసుతో పాటు వచ్చే ముడతలను తగ్గిస్తుంది. చర్మం యవ్వనంగా కనిపించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

బరువు తగ్గాలనుకుంటున్నారా.? అయితే ఆహారంలో పాలకూరను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. క్రమంతప్పకుండా పాలకూర తీసుకుంటే బరువు తగ్గొచ్చు. ఇందులో తక్కువ కేలరీలు ఉండడమే దీనికి కారణం.

పాలకూర మహిళలు ఎంతో మేలు చేస్తుంది. ముఖ్యంగా రక్త హీనత సమస్యతో బాధపడేవారు పాలకూరను కచ్చితంగా తీసుకోవాలి. ఇందులోని ఐరన్‌ ఆ సమస్యకు చెక్‌ పెడుతుంది. 

పాలకూరలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. అందుకే పాలకూరను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ కారకాలు పెరగకుండా అడ్డుకట్ట వేయొచ్చు. 

దీర్ఘకాలంలో వచ్చే కంటి సమస్యలకు చెక్‌ పెట్టడంలో పాలకూర కీలక పాత్ర పోషిస్తుంది. వారంలో రెండు సార్లైనా పాలకూర తీసుకుంటే కంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి.

మైగ్రేన్‌తో ఇబ్బందిపడుతున్నారా.? ఎన్ని రకాల మందులు వాడినా పరిష్కారం లభించడం లేదా? అయితే పాలకూరను క్రమం తప్పకుండా తీసుకోవాలి. దీంతో మైగ్రేన్‌ సమస్య దరి చేరకుండా ఉంటుంది.

పాలకూరలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. దీంతో రక్తపోటు సమస్యతో బాధపడుతున్న వారికి ఇది దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.