శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంతో నానబెట్టిన బాదం ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని ఎన్నో గుణాలు మంచి కొలెస్ట్రాల్‌ను పెంచుతుంది.
బరువు తగ్గడంలో కూడా నానబెట్టిన బాదం ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండిన భావన కలిగిస్తుంది.
ఇక నానబెట్టిన బాదంను ప్రతీరోజూ తీసుకోవడం ద్వారా.. గుండె ఆరోగ్యం మెరుగువుతుందని నిపుణులు చెబుతున్నారు. మంచి కొలెస్ట్రాల్ గుండెను రక్షిస్తుంది.
యాంటీ ఆక్సిడెంట్స్‌కు పెట్టింది పేరైన బాదం ఫ్రీ రాడికల్స్ వల్ల జరిగే నష్టాన్ని తగ్గిస్తుంది. దీంతో నిత్యం యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
క్యాన్సర్‌కు కూడా నానబెట్టిన బాదం దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని గుణాలు క్యాన్సర్ కణాలు పెరగకుండా చేస్తాయి. నానబెట్టిన బాదం లో ఉన్న ఫ్లేవనాయిడ్స్ ట్యూమర్ ని పెరగనివ్వవు.
ఇక నానబెట్టిన బాదంను క్రమం తప్పకుండా తీసుకుంటే రక్తపోటు సమస్యను తగ్గిస్తుంది. ముఖ్యంగా ఇందులో మెగ్నీషియం హైపర్ టెన్షన్‌ను దరిచేరనివ్వదు.
నానబెట్టిన బాదంలో ఫోలిక్ యాసిడ్ పుష్కలంగా ఉంటుంది. ఇది గర్భిణీలతో పాటు, తల్లి కావాలనుకుటున్న వారికి ఎంతగానో మేలు చేస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.