పొట్లకాయలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. వీటివల్ల క్యాన్సర్ కణాలు పెరగకుండా ఉంటాయి. అనేక రకాల క్యాన్సర్‌లకు చెక్ పెట్టొచ్చు
పొట్లకాయలో ఉండే ఎన్నో గుణాలు శరీరంలో యూరిక్ ఆసిడ్ స్థాయిలు పెరగకుండా నివారిస్తుంది. వారానికి రెండు సార్లైనా పొట్లకాయ తీసుకోవాలి
పొట్లకాయలో యాంటీ ఇంప్లమేటరీ గుణాలు, కాల్షియం పుష్కలంగా ఉంటాయి. ఇవి కీళ్ల నొప్పులను తగ్గించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో పొట్లకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్ రక్తంలోని కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రిస్తుంది
పొట్ల కాయను తీసుకోవడం వల్ల జ్వరం, కామెర్ల సమస్య తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైటో న్యూట్రియెంట్లు త్వరగా కామెర్ల నుంచి ఉపశమనం లభిస్తుంది.
సమ్మర్‌లో పొట్లకాయను క్రమంతప్పకుండా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులో నీటి శాతం అధికంగా ఉంటుంది. డీహైడ్రేషన్ దూరం అవుతుంది.
పొట్లకాయను జ్యూస్ చేసి తీసుకోవడం వల్ల కూడా మేలు జరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.