కంటి ఆరోగ్యానికి ఈ పండు ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో పుష్కలంగా లభించే విటమని ఏ కంటి సమస్యలను దూరం చేయడంలో తోడ్పడుతుంది.
స్నేక్ ఫ్రూట్‌లో కార్బోహైడ్రేట్స్, విటమిన్స్‌తో పాటు అనేక రకాల ఖనిజాలు పుష్పలంగా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు అంటున్నారు.
డయాబెటిస్ పేషెంట్స్‌కి కూడా స్నేక్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఫాస్పరస్ డయాబెటిస్‌ను దూరం చేయడంలో కీలకపాత్ర పోషిస్తుంది.
ఇక ఫైబర్ కంటెంట్‌కు ఈ ఫ్రూట్ పెట్టింది పేరు. ఇదిలా జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో తోడ్పడుతుంది. ముఖ్యంగా కడుపుబ్బరం, గ్యాస్ వంటి సమస్యలను దూరం చేస్తుంది.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఈ స్నేక్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుంది. ఇందులోని ఫైబర్ కంటెంట్ త్వరగా కడుపు నిండిన భావన కలిగేలా చేస్తుంది.
చిన్నారులకు కూడా స్నేక్ ఫ్రూట్ ఎంతో మేలు చేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పోషకాలు పిల్లల్లో జ్ఞాపకశక్తిని బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయని అంటున్నారు.
గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా ఈ ఫ్రూట్ ఎంతో ఉపయోగపడుతుంది. ఇందులోని పొటాషియం కంటెంట్ రక్తపోటును అదుపులో ఉంచుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.