నగ్నంగా పడుకుంటే ఏమవుతుందో తెలుసా.?

Narender Vaitla

17 Aug 2024

వినడానికి వింతగా ఉన్నా రాత్రుళ్లు దుస్తులు లేకుండా నిద్రించడం వల్ల ఎన్నో రకాల ప్రయోజనాలు ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు. పలు అధ్యయనాల్లో కూడా ఈ విషయాలు వెల్లడయ్యాయి.

నిద్రలేమి సమస్యతో బాధపడేవారు రాత్రుళ్లు దుస్తులు లేకుండా నిద్రిస్తే సమస్య దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. మెరుగైన నిద్రను ప్రోత్సాహిస్తుంది.

ఒత్తిడి సమస్యను కూడా దూరం చేయడంలో ఇది ఉపయోగపడుతుంది. ఇది శరీరానికి విశ్రాంతిని కలిగించి, ఆందోళన తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

నగ్నంగా పడుకోవడం వల్ల చర్మ ఆరోగ్యం మెరుగుపడుతుందని నిపుణులు చెబుతున్నారు. దుస్తులు లేకుండా నిద్రించడం వల్ల శరీరానికి బాగా గాలి తగులుతుంది దీంతో తేమను నివారిస్తుంది.

మహిళలకు ఇది మరింత ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. పీఎమ్​ఎస్ లక్షణాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఎస్ లక్షణాలను తగ్గిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక ఒంటరిగానే కాకుండా మీ భాగస్వామితో నగ్నంగా కలిసి పడుకుంటే బంధం బలోపేతం కావడంతో పాటు శరీరంలో ఆక్సిటోసిన్‌ విడుదల అవుతుందని చెబుతున్నారు. ఇది మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.