TV9 Telugu

6 April 2024

నువ్వులతో బోలెడన్ని లాభాలు.. 

ప్రతిరోజూ నువ్వులు ఆహారంలో భాగం చేసుకుంటే చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఇందులో గుణాలు మంచి కొవ్వును అందిస్తాయి. 

రక్తపోటు సమస్యతో ఇబ్బందిపడే వారికి నువ్వులు దివ్యౌషధంగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మెగ్నీషియం రక్తపోటును కంట్రోల్ చేస్తుంది. 

ఎముకలను బలంగా మార్చడంలో నువ్వులు ఎంతగానో ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని కాల్షియం, జింక్‌ ఎముకలు ధృడంగా మారడంలో ఉపయోగపడతాయి.

కీళ్ల నొప్పులతో బాధపడేవారికి కూడా నువ్వులు ఎంతగానే ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఇన్‌ప్లమేషన్‌ గుణాలు కీళ్ల ఆరోగ్యాన్ని కాపాడుతాయి

థైరాయిడ్‌ సమస్యతో బాధపడేవారు ప్రతీ రోజూ నువ్వులు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సెలీనియం ధైరాయిడ్‌ హార్మాన్లను ఉత్పత్తి చేయడంలో పనిచేస్తుంది.

నువ్వుల్లో ఉండే జింక్‌ చర్మాన్ని అందంగా, ఆరోగ్యంగా ఉంచడంలో ఉపయోగపడుతుంది. చర్మంపై నల్లటి మచ్చలు, ముడతలను నివారిస్తుంది.

నువ్వులను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల శరీరానికి బి1, బి3, బి6 వంటి విటమిన్లు అందుతాయి. అలాగే నువ్వుల్లోని మంచి గుణాలు కాలేయ పనితీరును మెరుగుపరుస్తాయి.

 పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.