సపోట కనిపించిన వెంటనే తినేయండి.. 

02 February 2024

TV9 Telugu

సపోట పోషకాలకు పెట్టింది పేరు. ముఖ్యంగా ఇందులోని విటమిన్‌ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. క్రమం తప్పకుండా సపోటా తీసుకుంటే రోగాలు దరిచేరవు.

ఇక సపోటలో పుష్కలంగా ఉండే విటమిన్‌ ఏ చర్మ సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తుంది. అలాగే కంటి చూపు మెరుగుపడడానికి ఉపయోగపడుతుంది.

సపోర్ట్‌లో ఫైబర్‌ అధికంగా ఉంటుంది. దీంతో జీర్ణ క్రియ సాఫీగా సాగడానికి ఉపయోగపడుతుంది. ఒక్క సపోట పండులో 9 గ్రాముల ఫైబర్‌ ఉంటుంది.

సపోటలోని సహజ చక్కెరలు ఇన్‌స్టాంట్‌ శక్తిని అందిస్తాయి. మధ్యాహ్నం సపోటను తీసుకుంటే శరీరానికి తక్షణ శక్తి లభిస్తుంది. 

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో సపోట కీలక పాత్ర పోషిస్తుంది. సపోటలో పుష్కలంగా లభించే పొటాషియం గుండె సంబంధిత వ్యాధులు దరిచేరకుండా చూస్తుంది. 

ఇక సపోటను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ రక్త ప్రసరణను ఆరోగ్యం ఉంచడడంలో ఉపయోగపడతాయి.

సపోటాలో కాల్షియం, ఐరన్‌, ఫాస్పరస్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి ఎముకలను దృఢంగా మార్చి, ఆరోగ్యంగా ఉంచుతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.