17 July  2024

చిటికెడు కుంకుమ పువ్వుతో.. బోలెడన్నీ లాభాలు. 

Narender.Vaitla

చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కుంకుమ పువ్వు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్లు చర్మం మెరిసేలా చేయడంలో ఉపయోగపడతాయి. 

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కూడా కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. ఇందులోని పైటోకెమిక‌ల్స్‌, ఫెనోలిక్ కాంపౌండ్ ఒత్తిడిని దూరం చేయడంలో ఉపయోపగడుతుంది.

రుతుక్రమ సమయంలో మహిళలు ఎదుర్కొనే సమస్యలకు కుంకుమపువ్వుతో చెక్‌ పెట్టొచ్చు. ఇది తీసుకోవడం వల్ల అధిక ర‌క్త‌స్రావం సమస్య దరిచేరకుండా ఉంటుంది.

ఇక పురుషుల్లో వచ్చే అంగ‌స్తంభ‌న, వీర్య క‌ణాలు తక్కువ ఉండడం వంటి సమస్యలకు కూడా కుంకుమ పువ్వు ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్నారు. 

క్యాన్సర్‌ మహమ్మారిని తరిమికొట్టడంలో కూడా కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది. శరీరంలో ఫ్రీరాడికల్స్‌ పెరగకుండా చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

నిద్రలేమి సమస్యను తగ్గించడంలో కూడా కుంకుపువ్వు ఉపయోగపడుతుంది. రాత్రి పడుకునే ముందు పాలలో కుంకుమ పువ్వు కలుపుకొని తీసుకోవడం వల్ల మంచి నిద్ర సొంతమవుతుంది.

మెదడు ఆరోగ్యాన్ని రక్షించడంలో కుంకుమ పువ్వు కీలక పాత్ర పోషిస్తుంది. జ్ఞాపకశక్తితో పాటు ఏకాగ్రత పెరగడంలో కుంకుమ పువ్వు ఉపయోగపడుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.