వేయించిన శనగలను ప్రతీ రోజూ ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల శరీరంలో శక్తి స్థాయిలు పెరుగుతాయి. ఇది శరీరాన్ని యాక్టివ్‌గా, ఎనర్జిటిక్‌గా ఉంచడంలో ఉపయోగపడుతుంది.
వేరు శనగల్లో ఫైబర్ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
బరువు తగ్గాలనుకునే వారికి శనగలు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని ఫైబర్ కంటెంట్ కారణంగా త్వరగా బరువు తగ్గుతారు. కేలరీలు సైతం తక్కువగా ఉంటాయి.
వేయించిన శనగల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను, దంతాలను బలోపేతం చేయడానికి తోడ్పడుతుంది. శరీరానికి కావాల్సిన కాల్షియం లభిస్తుంది.
శనగల్లో మెగ్నీషియం కంటెంట్ ఎక్కువగా ఉంటుంది. బీపీ ఉన్న వారు సాయంత్రం స్నాక్స్ రూపంలో శనగలను తీసుకోవాలి.
ఇక శనగాల్లో రాగి, ఫాస్పరస్ సైతం మెండుగా ఉంటాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తాయని పలు అధ్యయనాల్లో వెల్లడైంది.
షుగర్ పేషెంట్స్‌కి సైతం శనగలు ఎంతో మేలు చేస్తాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని గ్లైసెమిక్ ఇండెక్స్ రక్తంలో షుగర్ లెవల్స్ కంట్రోల్ ఉంచడంలో ఉపయోగపడుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.