24 May 2024

బీరకాయను అస్సలు లైట్ తీసుకోకండి.. 

Narender.Vaitla

జీర్ణక్రియను మెరుగుపరచడంలో బీరకాయ కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని సెల్యులోజ్‌, డైటర్‌ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. ఇది జీర్ణ వ్యవస్థను బలోపేతం చేస్తుంది.

లివర్‌ ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బీరకాయ ఉపయోగపడుతుంది. ఇందులోని మంచి గుణాలు హెపాటిక్ నాళంలో తలెత్తే కామెర్లు, ఇతర ఇన్ఫెక్షన్లను నయం చేయడానికి ఔషధంలా పనిచేస్తుంది.

బీరకాయలో విటమిన్ సి, ఐరన్, మెగ్నీషియం, రైబోఫ్లావిన్, థయామిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి రోగనిరోధక వ్యవస్థను మెరుగుపరుస్తాయి. శరీరంలో ఇన్ఫ్లమేషన్‌ను తగ్గించడంలో సహాయపడతాయి.

ఇందులోని పొటాషియం, మెగ్నీషియం హృదయనాళ వ్యవస్థ పనితీరులో కీలక పాత్ర పోషిస్తాయి. ఇవి గుండె ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

అల్సర్లతో బాధపడేవారు కూడా బీరకాయను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఇన్ఫ్లమేటరీ, కూలింగ్‌ ఏజెంట్స్ పెప్టిక్‌ అల్సర్ల నుంచి ఉపశమనం ఇవ్వడానికి సహాయపడుతాయి.

షుగర్‌ పేషెంట్స్‌కు బీరకాయ దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. ఇందులోని పెప్టెడ్‌లు, ఆల్కలాయిడ్‌లు రక్తంలోనూ మూత్రంలోనూ ఉండే చక్కెర నిల్వల శాతాన్ని తగ్గించేందుకూ తోడ్పడతాయి.

కంటి ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో బీరకాయ ఉపయోగపడుతుంది. ఇందులోని విటమిన్‌ ఏ కంటికండరాల బలహీనత కారణంగా తలెత్తే అంధత్వాన్ని నివారిస్తుందని నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.