నెల రోజులు చక్కెర మానేస్తే.. ఏమవుతుందో తెలుసా? 

25 October 2023

బరువు తగ్గాలనుకునే వారు చక్కెరకు దూరంగా ఉంటే వెంటనే ఫలితం ఉంటుంది. ఒక నెల రోజుల పాటు చక్కెరను మానెస్తే కచ్చితంగా బరువు తగ్గుతారు. 

నెల రోజుల పాటు చక్కెరకు దూరంగా ఉండడం వల్ల దంతాల ఆరోగ్యాన్ని రక్షించుకోవచ్చు. దంతాల సమస్యలు రావడానికి చక్కెర కూడా ఒక కారణమనే విషయం తెలిసిందే. 

చక్కెరను తగ్గించడం ద్వారా రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయి. దీంతో డయాబెటీస్‌ను నియంత్రించుకోవచ్చు. చక్కెర పరిమితికి మించి తీసుకుంటే రక్తంలో చక్కెర స్థాయిలు పెరగుతాయి.

చక్కెర ఎక్కువగా తీసుకుంటే చర్మ సంబధిత వ్యాధులు కూడా వచ్చే అవకాశం ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. చక్కెరకు దూరంగా ఉంటే చర్మం సంబంధిత వ్యాధులు దూరమవుతాయి. 

ఇక మానసిక ఆరోగ్యంపై కూడా చక్కెర ప్రభావం చూపుతుందని పలు అధ్యయనాల్లో వెల్లడైంది. కాబట్టి చక్కెరను తగ్గిస్తే మానసిక ఆరోగ్యం మెరుగవుతుందని నిపుణులు చెబుతున్నారు. 

చక్కెరను మితంగా తీసుకోవడం వల్ల జీర్ణ వ్యవస్థ మెరుగువుతుంది. జీర్ణక్రియ రేటు పెరుగుతుంది. అంతేకాకుండా కడుపులో మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది.

చక్కెరను ఎక్కువ తీసుకోవడం వల్ల క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉంటుందని నిపునులు చెబుతున్నారు. ఒక నెల రోజుల పాటు చక్కెరకు దూరంగా ఉంటే క్యాన్సర్‌ ప్రమాదం తగ్గుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.