రోజూ ఒక చింతకాయ తినండి.. మార్పు మీరే చూడండి..

Narender Vaitla

22 September 2024

డయాబెటిస్ బాధితులకు చింతకాయ బాగా ఉపయోగపడుతుంది. ఇందులోని కార్బోహైడ్రేట్స్‌ రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్‌ చేయడంలో ఉపయోగపడతాయి.

లివర్‌ డ్యామేజ్‌ను కంట్రోల్‌ చేయడంలో కూడా చింతకాయ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఆక్సిడేటివ్‌ ఒత్తిడి వల్ల జరిగే డ్యామేజ్‌ నుంచి కాలేయాన్ని రక్షిస్తుంది.

చర్మాన్ని మృదువుగా, కాంతివంతంగా మార్చడంలో చింతకాయ ఉపయోగపడుతుంది. ఇందులోని ఆల్ఫా హైడ్రాక్సీ యాసిడ్స్‌ చర్మకాంతిని మెరుగుపరుస్తుంది.

బరవు తగ్గాలనుకుంటున్నారా.? అయితే ప్రతీ రోజూ కచ్చితంగా ఒక చింతకాయను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్ బరువు తగ్గడంలో తోడ్పడుతుంది.

మెరుగైన జీర్ణశక్తిని పెంపొందించడంలో చింతకాయ ఉపయోగపడుతుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుందని నిపుణులు చెబుతున్నారు.

రక్తంలోని చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో చింతకాయలోని ఫైబర్‌ ఉపయోగపడుతుంది. దీంతో గుండెకు రక్త సరఫరా మెరుగవుతుంది. ఇది గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో తోడ్పడుతుంది

కంటిచూపును మెరుగుపరచడంలో కూడా చింతకాయ బాగా ఉపయోగపడుతుంది. కంజెక్టివైటిస్ను తగ్గించడంలో చింతకాయ సహాయపడుతుందని నిపుణులు చెబుతున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.