నానబెట్టిన ఎండు ద్రాక్ష నీరు మంచి డిటాక్స్ వాటర్‌లా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇది శరీరంలో పేరుకుపోయిన టాక్సిన్స్‌ను బయటకు పంపించడంలో ఉపయోగపడతాయి.
నానబెట్టిన ఎండు ద్రాక్ష నీటిని తీసుకోవడం ద్వారా జీర్ణక్రియ మెరుగవుతుంది. కడుపు ఉబ్బరం, అజీర్తి వంటి సమస్యలు దరిచేరకుండా ఉండడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
నానబెట్టిన ఎండుద్రాక్ష నీటిలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. ఇది ఫ్రీ రాడికల్స్ నుంచి శరీరాన్ని రక్షిస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచడంలో ఉపయోగపడుతుంది.
కాలేయ పనితీరు మెరుగుపరచడంలో కూడా ఎండుద్రాక్ష నీరు కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ఇన్‌ఫ్లేమేషన్ తగ్గడంలో ఎండు ద్రాక్ష నీరు ఉపయోగపడుతుంది.
అధిక రక్తపోటుతో బాధపడే వారు నానబెట్టిన ఎండుద్రాక్ష నీటిని తీసుకోవడం వల్ల బీపీ అదుపులోకి వస్తుంది. క్రమం తప్పకుండా పడగడుపున నీటిని తీసుకోవడం వల్ల బీపీ తగ్గుతుంది.
ఎండు ద్రాక్ష నానబెట్టిన నీటిలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్త హీనత సమస్యతో బాధపడుతున్న వారికి ఇది దివ్యౌషధంగా ఉపయోగపడుతుంది. రక్తంలో హిమోగ్లోబిన్ పెరుగుతుంది.
బరువు తగ్గాలనుకునే వారికి కూడా ఎండు ద్రాక్ష నానబెట్టిన నీరు ఉపయోగపడుతుంది. శరీరం నుంచి హానికరమైన కొలెస్ట్రాన్‌ను తొలగిస్తుంది. దీంతో బరువు తగ్గొచ్చు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.