రోజూ రాగి జావ తాగితే ఏమవుతుందో తెలుసా.?

Narender Vaitla

22 September 2024

క్రమంతప్పకుండా ప్రతీరోజూ రాగిజావను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడొచ్చని సూచిస్తున్నారు.

రాగి జావను తీసుకోవడం వల్ల ఆందోళన, డిప్రెషన్‌, నిద్రలేమి వంటి ఎన్నో సమస్యలకు ఫుల్ స్టాప్‌ పడుతుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక మెరుగైన జీర్ణక్రియకు రాగి జావ బాగా ఉపయోగపడుతుందని నిపుణులు అంటున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో దోహదపడుతుంది. 

మల బద్ధకంతో బాధ పడేవారు కచ్చితంగా ప్రతీరోజూ రాగి జావను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ మలబద్ధకాన్ని దూరం చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.

ఇక డయాబెటిస్‌తో బాధపడేవారికి కూడా రాగిజావ ఎంతో మేలు చేస్తుంది. ఇందులో పాలీఫెనాల్స్, డైటరీ ఫైబర్‌,మెగ్నీషియం రక్తంలో గ్లూకోజ్‌ను నియంత్రిస్తాయి.

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా రాగి జావ ఉపయోగపడుతుంది. ఇందులో ఉంటే మెగ్నీషియం, ఫైబర్‌ గుండె కండరాల పనితీరు, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

రాగిజావలో ఐరన్‌ కంటెంట్‌ పుష్కలంగా ఉంటుంది. ఇది రక్తంలో హిమోగ్లోబిన్‌ స్థాయిలను పెంచడంతో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరాకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.