05 July  2024

ఈసారి మార్కెట్‌కి వెళ్తే.. ముల్లంగి కచ్చితంగా కొనండి. 

Narender.Vaitla

ముల్లంగిలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. వర్షాకాలంలో వచ్చే అనారోగ్య సమస్యలను చెక్‌ పెట్టడంలో ఇది ఉపయోగపడుతుంది. రోగనిరోధశ శక్తిని పెంచుతుంది.

ముల్లంగిలో పొటాషియం పుష్కలంగా ఉంటుంది. ఇది రక్లపోటును నియంత్రించడంలో ఉపయోగపడుతుంది. హైపర్‌ టెన్షన్‌ ఉన్న వాళ్లు ముల్లంగి తీసుకుంటే మేలు జరుగుతుంది.

ప్రతీ రోజూ ముల్లంగిని క్రమంతప్పకుండా తీసుకుంటే గుండె సంబంధిత సమస్యలు పూర్తిగా నయమవుతాయి. ఇందులోని ఫోలిక్‌ యాసిడ్‌, ఫ్లేవనాయిడ్స్‌ రక్తంలో ఆక్సిజన్ సరఫరాను  పెంచుతుంది.

ముల్లంగిలో ఫైబర్‌ కంటెంట్ పుష్కలంగా ఉంటుంది. దీంతో జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు. మలబద్ధకం కూడా దూరమవుతుంది.

మెరిసే చర్మం సొంతమవ్వాలంటే కచ్చితంగా ముల్లంగి రసాన్ని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. పొడి చర్మం, మొటిమలు తగ్గించడంలో ఉపయోగపడుతుంది.

పైల్స్‌ సమస్యతో బాధపడేవారికి కూడా ముల్లంగి దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఇందులోని ఫైబర్‌ కంటెంట్ ఆ సమస్యను దూరం చేయడంలో ఉపయోగపడుతుంది.

క్యాన్సర్‌ కణాలను నియంత్రించడంలో కూడా ముల్లంగి కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో క్యాన్సర్లతో పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.