పల్లీల్లో ఆరోగ్యకరమైన ఫ్యాట్స్ పుష్కలంగా ఉంటాయి. దీంతో బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ ఆప్షన్‌గా చెప్పొచ్చు. ఇందులోని ఫైబర్ కంటెంట్ బరువును ఇట్టే తగ్గిస్తుంది.
పల్లీల్లో పుష్కలంగా లభంచే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను మెరుగుపరస్తుంది. ముఖ్యంగా అజీర్తి, అసిడిటీ, పొట్ట ఉబ్బరం వంటి సమస్యలను దూరం చేస్తుంది.
షుగర్ పేషెంట్స్‌కి కూడా పల్లీలు ఎంతగానో ఉపయోగపడాతాయి. ముఖ్యంగా ఉడికించిన పల్లీలను తీసుకోవడం వల్ల రక్తంలో గ్లూకోజ్ స్థాయిలు పెరగవు. రక్తంలో చక్కెర స్థాయిలను కంట్రోల్ చేయడంలో సాయపడుతుంది.
గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పల్లీలు బాగా సహాయపడతాయి. ఇందులోని నియాసిన్, కాపర్, మెగ్నీషియం, ఒలేయిక్ యాసిడ్, రెస్వరాట్రల్ వంటి గుండె జబ్బుల్ని దూరం చేస్తాయి.
మానసిక సమస్యలను దూరం చేయడంలో కూడా పల్లీలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ట్రిప్టోఫాన్.. శరీరంలో సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. దీంతో డిప్రెషన్ తగ్గుతుంది.
ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పల్లీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులోని మాంగనీస్, భాస్వరంలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. బోలు ఎముకల వ్యాధి వచ్చే ప్రమాదాన్ని తగ్గిస్తాయి.
పల్లీల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఇది కళ్ల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు అంటున్నారు. రేచీకటి సమస్య దూరమవుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.