TV9 Telugu

16 May 2024

పల్లీలే కదా అనుకోకండి.. లాభాలు తెలిస్తే మాత్రం 

పల్లీల్లో ఉండే మెగ్నీషియం, కాపర్, యాంటీఆక్సిడెంట్లు గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని మోనోశాచురేటెడ్ కొవ్వులు, ఫైబర్, ప్రోటీన్లు పుష్కలంగా కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గిస్తాయి.

మెదడు పనితీరు మెరుగుపరచడంలో కూడా పల్లీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ముఖ్యంగా స్ట్రోక్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. మొత్తం రోగనిరోధక శక్తిని పెంచడానికి సహాయపడుతుంది.

యాంటీ ఆక్సిడెంట్స్‌కు పల్లీలు పెట్టింది పేరు. ఇందులో పుష్కలంగా లభించే ట్రిప్టోఫాన్ సెరోటోనిన్ స్థాయిలను పెంచుతుంది. ఇది డిప్రెషన్‌ నుంచి బయటపడేందుకు ఉపయోగపడుతుంది.

మధుమేహంతో బాధపడే వారికి కూడా పల్లీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులోని ఫైబర్ , ప్రోటీన్ కంటెంట్ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచడానికి దోహదం చేస్తుంది.

బరువు తగ్గాలనుకునే వారు కచ్చితంగా డైట్‌లో పల్లీలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్ఆనరు. ఇందులో అధికంగా ఉండే ఫైబర్‌ కంటెంట్‌, ప్రోటీన్లు బరువు తగ్గడంలో ఉపయోడపతాయి.

ఎముకలు బలోపేతం అవ్వడంలో కూడా పల్లీలు ఉపయోపగపడాతయని నిపుణులు అంటున్నారు. ఇందులోని మాంగనీస్, ఫాస్పరస్ ఎముకలను ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది.

 పల్లీల్లో అధికంగా లభించే ఫైబర్‌ జీర్ణ క్రియను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. వీటిని క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల జీర్ణ సంబంధిత సమస్యలు దరిచేరవు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.