12 July  2024

పల్లీలే కాదా అని  లైట్ తీసుకోకండి.. 

Narender.Vaitla

గుండె ఆరోగ్యంగా ఉండాలంటే రోజూ పల్లీలను కచ్చితంగా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటివల్ల శరీరంలో చెడ కొలెస్ట్రాల్ తగ్గి, మంచి కొలెస్ట్రాల్‌ పెరుగుతుంది.

కంటి ఆరోగ్యం మెరుగుపరచడంలో కూడా పల్లీలు కీలక పాత్ర పోషిస్తాయి. ఇందులో లభించి విటమిన్‌ ఏ కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

డిప్రెషన్‌ సమస్యతో బాధపడేవారికి కూడా పల్లీలు ఎంతగానో ఉపయోగపతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ట్రిప్టోఫాన్‌.. శరీరంలో సెరోటోనిన్‌ స్థాయిలను పెంచుతుంది.

పల్లీలను ప్రతీ రోజూ కొంత మోతాదులో తీసుకుంటే.. ఎముకలు బలంగా మారుతాయి. ఇందులో ఉండే మాంగనీస్, భాస్వరంలు ఎముకల ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది.

వర్షాకాలంలో తరచుగా వచ్చే జలుబు, దగ్గు వంటి శ్వాస సంబంధిత సమస్యలు తగ్గించడంలో పల్లీలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు.

డయాబెటిస్‌ సమస్యతో బాధపడేవారికి కూడా పల్లీలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులో పుష్కలంగా లభించే ఫైబర్‌, ప్రోటీన్‌ కంటెంట్‌ రక్తంలో చక్కెర స్థాయిలను స్థిరంగా ఉంచుతుంది.

బరవు తగ్గాలనుకునే వారికి పల్లీలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని ఫైబర్‌ కారణంగా కడుపు నిండిన అనుభూతి కలుగుతుంది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.