కండరాలు బలోపేతం చేయడంలో పల్లిపట్టిలు ఎంతగానో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా పల్లీలోని సెలీనియం, బెల్లంలో ఉండే మెగ్నీషియం కండరాలను బలోపేతం చేస్తుంది.
జీర్ణక్రియను మెరుగు చేయడానికి పల్లిపట్టీలు ఎంతగానో ఉపయోగపడుతాయి. ముఖ్యంగా వేరు శనగల్లో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ క్రియను మెరుగుపరుస్తుంది.
హీమోగ్లోబిన్ లోపం ఉన్న వారికి పల్లిపట్టీలు ఎంతగానో ఉపయోగపడుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ రక్తాన్ని శుద్ధి చేయడంలో ఉపయోగపడతాయి.
గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో పల్లిపట్టీలు ముఖ్యపాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. రక్త సరఫరా పెరిగి గుండె జబ్బుల నుంచి ముప్పు తగ్గుతుంది.
రోగ నిరోధక శక్తి పెరగడంలో పల్లిపట్టిలు ఎంతగానో ఉపయోగపడతాయి. ఇందులోని మంచి గుణాలు రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో కూడా పల్లిపట్టిలు ఉపయోగపడతాయి. చర్మం తాజాగా మారడంతో పాటు, మచ్చలు తొలగిపోతాయి.
పల్లిపట్టీల్లో ఫాస్ఫరస్, నియాసిన్, థయామిన్ వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. గర్భిణీలు, పాలిచ్చే తల్లులకు పల్లిపట్టీలను తినడం వల్ల ఎంతో మేలు జరుగుతుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.