గుమ్మడి గింజలు ఫైబర్‌కు పెట్టింది పేరు వీటిని తీసుకోవడం వల్ల అధిక బరువు సమస్యను తగ్గించుకోవచ్చని నిపుణులు చెబుతున్నారు.
మలబద్ధకం, జీర్ణ సంబంధిత వ్యాధులతో బాధపడేవారికి కూడా గుమ్మడి గింజలు ఉపయోగపడతాయి. ఇందులోని ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది.
గుమ్మడి గింజలు క్రమంతప్పకుండా తీసుకుంటే క్యాన్సర్ సమస్య దరిచేరదని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్ ఫ్రీరాడికల్స్ నుంచి రక్షిస్తాయి.
గుమ్మడి గింజల్లోని మెగ్నీషియం గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. హైపర్ టెన్షన్‌ను కంట్రోల్‌లో ఉంచుకోవడానికి ఎంతగానో ఉపయోగపడతాయి.
గుమ్మడి గింజల్లోని ఔషధ గుణాలు కండరాల ఆరోగ్యాన్ని రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తాయి. కండరాలు బలంగా మార్చడంలో వీటి పాత్ర కీలకమైంది.
వీటిలోని యాంటీడయాబెటిక్ లక్షణాలు షుగర్ వ్యాధికి చెక్ పెడుతుంది. ఇవి రక్తంలోని చక్కెర స్థాయిలను కంట్రోల్‌లో ఉంచుతాయి.
జుట్టు రాలడం సమస్యకు కూడా గుమ్మడి గింజలు చెక్ పెడుతుంది. వీటిలోని సెలెనియం, మెగ్నీషియం, క్యాల్షియ జుట్టు సంబంధిత సమస్యలను దరిచేరనివ్వదు
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.