16 June 2024

ఈత కల్లు నిజంగానే  మంచిదా.? 

Narender.Vaitla

ప్రకృతి నుంచి సహజంగా లభించే ఈత కల్లులో విటమిన్‌ బీ2 పుష్కలంగా ఉంటుంది. ఇది క్యాన్సర్‌కు కారణమయ్యే ఫ్రీ రాడికల్స్‌తో పోరాడుతుంది. క్యాన్సర్‌కు చెక్‌ పెట్టడంలో ఉపయోగపడుతుంది.

కల్లులో విటమిన్‌ సి, థయానిమ్‌ పుష్కలంగా ఉంటుంది. ఇవి కంటి ఆరోగ్యాన్ని సంరక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ముఖ్యంగా పశ్చిమ, మధ్య ఆఫిక్రాలో కూడా ఈ కల్లును తీసుకుంటున్నారు.

ఈత కల్లును మితంగా తీసుకుంటే గుండె జబ్బుల ముప్పును తగ్గిస్తుందని చెబుతుంటారు. ఇందులోని పొటాషియం గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

ఫ్లూ, జలుబు వంటి వైరల్ జ్వరాల నుంచి ఉపశమనం కల్పించడంలో కూడా ఈత కల్లు ఉపయోగపడుతుంది. దగ్గు, తుమ్ములు ఎక్కువగా వచ్చే వారికి ఉపయోగపడుతుంది.

ఈత కల్లులో ఐరన్‌, విటమిన్‌ బి కాంప్లెక్స్‌లు పుష్కలంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. ఇది చర్మం, జుట్టు, ఆరోగ్యాన్ని కాపాడడంలో ఉపయోగపడుతుంది.

అయితే కల్లును అతిగా తీసుకుంటే సైడ్‌ ఎఫెక్ట్స్‌ కూడా తప్పవని చెబుతున్నారు. ముఖ్యంగా కాలేయ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది.

అలాగే కల్లును మోతాదుకు మించి తీసుకుంటే నరాలపై ప్రభావం పడుతుందని నిపుణులు అంటున్నారు. దీర్ఘకాలంలో గుంండెపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు.

 పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.