ఆరెంజ్‌తో ఎన్ని లాభాలో.. 

29 October 2023

ఆరెంజ్‌లో ఉండే తక్కువ క్యాలరీలు, ఎక్కువ ఫైబర్‌ కారణంగా బరువు తగ్గుతారు. ముఖ్యంగా పొట్ట, నడుము చుట్టు ఉండే కొవ్వు తగ్గుతుంది. 

విటమిన్‌ ఏకి పెట్టింది పేరు ఆరెంజ్‌. కంటి చూపును మెరుగుపరచడంతో నారింజది కీలక పాత్ర. కంటి చూపు సమస్యలకు ఆరెంజ్‌తో చెక్‌ పెట్టొచ్చు. 

చర్మాన్ని ఆరోగ్యవంతం చేయడంలో ఆరెంజ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులో ఉండే విటమిన్‌ సి, యాంటీ ఆక్సిడెంట్స్‌ చర్మాన్ని కాపాడుతుంది. 

గుండె ఆరోగ్యాన్ని కాపాడడంలో ఆరెంజ్‌ కీలక పాత్ర పోషిస్తుంది. కొలెస్ట్రాల్‌ను తగ్గించడంలో సహాయపడుతుంది. రక్తపోటు, రక్తహీనతకు చెక్‌ పెటొచ్చు. 

శృంగార సమస్యలకు కూడా ఆరెంజ్‌తో చెక్‌ పెట్టొచ్చు. ముఖ్యంగా పురుషుల్లో శృంగార సమస్యలను నారింజ దూరం చేస్తుంది. 

విటమిన్‌ బీ కాంప్లెప్స్‌కు నారింజ పెట్టింది పేరు. దీనివల్ల రక్తంలో హిమోగ్లోబిన్‌ శాతం పెరుగుతుంది. ఎముకలు పటిష్టంగా అవుతాయి. 

జీర్ణ వ్యవస్థ మెరుగవ్వడంలోనూ నారింజది ముఖ్యపాత్ర. ఇందులోని విటమిన్‌ సి జీర్ణ క్రియ వ్యవస్థను మెరుగుపరుస్తుంది. అజీర్తి వంటి సమస్యలు దరి చేరవు. 

ఇక పండు మాత్రమే కాకుండా తొక్కతోనే లాభాలున్నాయి. చర్మం జిడ్డుగా ఉండే.. తొక్కలను ఎండ బెట్టి పొడి చేయాలి. అనంతరం అందులో తేనె కలిపి ముఖానికి పట్టించాలి.